
శంషాబాద్, వెలుగు: హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్ అని తెలుసుకొని దాన్ని తినడానికి ముంబై నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు సమ్మెతో అష్టకష్టాలు పడ్డాడు. శనివారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఒవైసీ సల్మాన్ ముంబై వాసి సమ్మె కారణంగా ఎటూ పోలేక దాదాపు ఆరు గంటలు ఎయిర్ పోర్ట్ లోనే నిరీక్షించాడు. ఒక ప్రైవేట్ క్యాబ్ ను ఆశ్రయించగా, క్యాబ్ డ్రైవర్ హైదరాబాద్ కు వెళ్లడానికి రూ.1500లు అవుతుందని చెప్పాడు. అవాక్కయిన ఓవైసీ సల్మాన్ ముంబై నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి విమానం టికెట్ రూ.2 వేలు కాగా, క్యాబ్ డ్రైవర్ అడిగినంత డబ్బులు ఇవ్వలేక, నిరాశతో ముంబై కి తిరిగి వెళ్లిపోయాడు.