- హర్యానా నుంచి తెప్పించి అమ్మకాలు
ఓల్డ్‌సిటీ, వెలుగు: ఓల్డ్‌సిటీలోని కాలాపత్తర్లో రూ.7 లక్షల చైనా మాంజా పట్టుబడింది. మహ్మద్ షాజైబ్ అలియాస్ అనీస్ (42) కాలాపత్తర్లో నివాసం ఉంటూ స్థానికంగా పతంగుల వ్యాపారం చేస్తున్నాడు. పక్కా సమాచారంతో ఆదివారం అనీస్ దుకాణంపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అండ్ సౌత్ వెస్ట్ జోన్ టీమ్స్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ ఇక్బాల్ సిద్దిక్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ యాదేందర్, ఎస్‌ఐపీ జి. సందీప్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు దాడి చేశారు.
345 బాబిన్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్ట్ చేశారు.హర్యానాకు చెందిన తన సహచరుడు విక్రమ్ మెహతా ద్వారా మాంజాను హైదరాబాద్‌కు తెప్పించి అమ్ముతున్నట్లు గుర్తించారు. పట్టుబడిన మాంజా విలువ దాదాపు రూ.7 లక్షలు వరకు ఉంటుందని పోలీసుల అంచనా.
