ఇవాళ ( జనవరి 12 ) యూసుఫ్గూడలో ట్రాఫిక్ ఆంక్షలు... ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం కోసం మళ్లింపులు

ఇవాళ ( జనవరి 12 ) యూసుఫ్గూడలో ట్రాఫిక్ ఆంక్షలు... ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం కోసం మళ్లింపులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు : కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ పోలీసులు సోమవారం నిర్వహించే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం సందర్భంగా యూసుఫ్​గూడ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు చోట్ల డైవర్షన్లు అమలు చేస్తారు. 

  • మైత్రీవనం జంక్షన్ నుంచి యూసుఫ్​గూడ బస్తీ, రహ్మత్​నగర్, కార్మికనగర్, బోరబండ బస్ స్టాప్ వైపు వచ్చే ట్రాఫిక్​ను యూసుఫ్‌‌గూడ బస్తీ వద్ద క్రిష్ణకాంత్ పార్క్, జీటీఎస్ టెంపుల్, మోతీ నగర్, బోరబండ బస్ స్టాప్ వైపు మళ్లిస్తారు.
  • మైత్రీవనం జంక్షన్ నుంచి యూసుఫ్‌‌గూడ చెక్ పోస్ట్, మాదాపూర్ సైడ్, జూబ్లీ హిల్స్ చెక్​పోస్ట్ వైపు వెళ్లే ట్రాఫిక్​ను యూసుఫ్​గూడ బస్తీ వద్ద ఆర్​బీఐ క్వార్టర్స్, క్రిష్ణానగర్ జంక్షన్, జూబ్లీ హిల్స్ చెక్​పోస్ట్ వైపు పంపిస్తారు.
  • జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్, వెంకటగిరి నుంచి స్టేడియం వైపు వచ్చే ట్రాఫిక్​ను క్రిష్ణానగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.
  • బోరబండ బస్టాప్ నుంచి కార్మికనగర్, రహ్మత్​నగర్, యూసుఫ్​గూడ చెక్ పోస్ట్ వైపు వెళ్లే ట్రాఫిక్​ను ప్రైమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్, శ్రీ రామ్ నగర్ ఎక్స్ రోడ్స్ వద్ద మిడ్​ల్యాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కల్యాణ్ నగర్ జంక్షన్, వెంగళరావు నగర్, ఉమేశ్ చంద్ర స్టాచ్యూ నుంచి ఐసీఐసీఐ వద్ద యూ టర్న్ తీసుకుని మైత్రీవనం జంక్షన్ వైపు మళ్లిస్తారు. స్టేడియానికి వచ్చే విద్యార్థులు, ప్రజలు టీజీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్​లో వాహనాలు పార్క్ చేసుకోవచ్చని పోలీసులు 
  • సూచించారు