తపస్ స్టేట్ కొత్త కమిటీ ఎన్నిక..రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్, పెంటయ్య

తపస్ స్టేట్ కొత్త కమిటీ ఎన్నిక..రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్, పెంటయ్య

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వచ్చే మూడేండ్ల కాలానికి (2025–28) గాను సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లాకు చెందిన వోడ్నాల రాజశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి జిల్లాకు చెందిన తెల్కలపల్లి పెంటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఆదివారం అబిడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. రాష్ట్రంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్ఎస్ఎం జాతీయ సంఘటన మంత్రి మహేంద్ర కపూర్, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్, హనుమంత్ రావు, నవాత్ సురేశ్ పాల్గొన్నారు.