ఈపీఎఫ్‌‌‌‌ఓలోకి19.50 లక్షల మంది

ఈపీఎఫ్‌‌‌‌ఓలోకి19.50 లక్షల మంది

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో  నికరంగా 19.50 లక్షల మంది  ఈపీఎఫ్‌‌‌‌ఓ సభ్యత్వం తీసుకున్నారు. ఒక నెలలో ఇంత ఎక్కువ మంది ఈపీఎఫ్‌‌‌‌ఓకి యాడ్ కావడం ఇదే మొదటిసారి. ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్‌‌‌‌పై అవగాహన పెరగడం, ఈపీఎఫ్‌‌‌‌ఓ సర్వీస్‌‌‌‌లు విస్తరించడం వంటి అంశాలు  మెంబర్లు పెరగడానికి కారణమయ్యాయి. 

ఈ ఏడాది మే నెలలో కొత్తగా 9.85 లక్షల మంది పీఎఫ్‌‌‌‌ అకౌంట్లు ఓపెన్ చేశారు. ఈపీఎఫ్‌‌‌‌ఓ సభ్యత్వం కోల్పోయి మళ్లీ ఓపెన్ చేసిన వారి సంఖ్య 14.09 లక్షలుగా ఉంది. వీరు తమ జాబ్‌‌‌‌లను మార్చుకోవడం లేదా  మళ్లీ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం చేశారు.