పాక్ మతగురువు ఉచిత సలహ: మనం నిద్రపోతే కరోనా నిద్రపోతుంది..మనం చచ్చిపోతే కరోనా చచ్చిపోతుంది

పాక్ మతగురువు ఉచిత సలహ: మనం నిద్రపోతే కరోనా నిద్రపోతుంది..మనం చచ్చిపోతే కరోనా చచ్చిపోతుంది

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు. పాకిస్తాన్ కు చెందిన  మత గురువులు కరోనా పై వాళ్లకు నచ్చినట్లు ప్రజలకు హిత బోధ చేస్తున్నారు.

పాకిస్తాన్ లో లక్షా 39వేల మందికి పైగా కరోనా సోకింది. వారిలో 2632మంది మరణించగా, 51,735 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలు నిద్రపోతే కరోనా నిద్రపోతుందంటూ ఓ మతగురువు ప్రచారం చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

టైమ్స్ న్యూస్ నౌ కథనం ప్రకారం.. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ   మాజీ సభ్యుడు, మతగురువు ఫజల్ ఉర్ రెహ్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ మనం ఎక్కువ సేపు నిద్రపోవాలి. మనం నిద్రపోతే కరోనా నిద్రపోతే. మనం చనిపోతే..కరోనా చనిపోతుందంటూ హితువు పలికారు. ప్రస్తుతం ఫజల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.