యశోద హాస్పిటల్​పై ఎంక్వైరీ షురూ

యశోద హాస్పిటల్​పై ఎంక్వైరీ షురూ
  •     ఇద్దరు సీనియర్​ డాక్టర్లతో కమిటీ
  •     3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

హైదరాబాద్​, వెలుగు: కాన్పు కోసం అడ్మిట్​​అయిన గర్భిణికి కరోనా సోకిందని ట్రీట్​మెంట్​ చేసి రూ.29 లక్షలు వసూలు చేసిన  యశోద హాస్పిటల్​పై హైదరాబాద్​ డీఎంహెచ్​వో విచారణకు ఆదేశించారు. ​ఇద్దరు సీనియర్​ డాక్టర్లతో మంగళవారం కమిటీ వేశారు. మలక్​పేట యూచ్​ఎన్​​సీ హెల్త్​ ఆఫీసర్​ డాక్టర్​ విజయ లక్ష్మి, శాలివాహన నగర్​​యూపీహెచ్​సీ మెడికల్​​ఆఫీసర్​​డాక్టర్​ పి. వీణను ఎంక్వైరీ కమిటీ సభ్యులుగా నియమించారు. మూడు రోజుల్లో రిపోర్ట్​ ఇవ్వాలని ఆదేశించారు. మహబూబ్​నగర్​ జిల్లా గండీడ్​ మండలం బల్సూరుగొండకు చెందిన ఏసీటీవో శ్వేతారెడ్డి కాన్పు కోసం ఆగస్టు 4న యశోద ఆస్పత్రిలో చేరారు. ముందు రూ.2 లక్షలు డిపాజిట్​​ చేయించుకున్నారు. ఆ తర్వాత రూ.29 లక్షల వరకు వసూలు చేసిన హాస్పిటల్​ మేనేజ్​మెంట్​ ఈనెల 3న ఆమె చనిపోయారని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. ఈ ఘటనపై హైదరాబాద్​ డీఎంహెచ్​వోకు ఆలిండియా యాంటీ కరప్షన్​ కమిటీ తెలంగాణ అధ్యక్షుడు ముజాహిద్​ మోయిద్దీన్​​ఖాద్రీ మెయిల్​ ద్వారా ఫిర్యాదు చేశారు.