దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం ఫ్లైయింగ్ కేడెట్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న 9 మంది మహిళా కేడెట్లు సహా మొత్తం 235 ఫ్లైట్ కేడెట్లు గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. పిలాటస్ పీసీ-7, సారంగ్ హెలికాప్టర్, సూర్యకిరణ్ ఏరోబాటిక్, సుఖోయ్ యుద్ధ విమానాల ఫ్లైయింగ్ ఆఫీసర్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
పరేడ్అనంతరం ఫ్లైయింగ్ కేడెట్లు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. శిక్షణ పూర్తిచేసుకున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మురిసిపోయారు.
- వెలుగు, హైదరాబాద్