ఈజీగా మనీ సంపాదించాలనుకుని.. గంజాయి అమ్మకం

ఈజీగా మనీ సంపాదించాలనుకుని.. గంజాయి అమ్మకం

జీడిమెట్ల, వెలుగు: గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని బాలానగర్​ ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్​ చేశారు.  పోలీసులు తెలిపిన ప్రకారం.. బోడుప్పల్, పీర్జాదిగూడ పర్వతనగర్​కి చెందిన కట్టెబోయిన రమేశ్ యాదవ్ (30) ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్​వైజర్.​ ఈజీగా మనీ సంపాదించేందుకు గంజాయి అమ్మేందుకు నిర్ణయించాడు. పాత నేరస్తుడు వడపర్తి కిరణ్​ అలియాస్ సురేశ్​తో కలిసి గంజాయి బిజినెస్ చేస్తున్నారు. మూడు రోజుల కిందట రమేశ్ యాక్టివాపై భద్రాచలం వెళ్లి సురేశ్​వద్ద 3 కిలోల గంజాయి తీసుకుని సిటీకి వచ్చాడు. జగద్గిరిగుట్టలో కూలీలకు అమ్ముతుండగా సమాచారం మేరకు పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకుని రూ.75వేల విలువైన 3 కిలోల గంజాయి, యాక్టివా, మొబైల్ ను స్వాధీనం చేసుకుని కేసు  నమోదు చేశారు.