మార్చి 25న సిట్ కస్టడీ పిటిషన్ పై విచారణ

మార్చి 25న సిట్ కస్టడీ పిటిషన్ పై విచారణ

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. నిందితులు ప్రవీణ్ కుమార్, రేణుక డాక్యలకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై సోమవారం నాంపల్లి కోర్టు విచారించనుంది. మరోవైపు TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది.

ఏ 1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్, ఏ-10 షమీమ్, ఏ -11, సురేష్, ఏ -12 రమేష్ లను ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. సిట్ కస్టడీ పిటిషన్ పై మార్చి 25వ తేదీన నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది.