
సౌత్ అమెరికాలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో అత్యంత చెత్త సీన్ చోటు చేసుకుంది. మెన్స్ ఫుట్ బాల్ ప్లేయర్ జేవియర్ బొలివర్ మహిళా రిఫరీ ముఖంపై చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కొలంబియన్ మహిళా ఫుట్ బాల్ లో భాగంగా వెనెస్సా సెబాలోస్ వేదికగా జరిగిన రియల్ అలియాంజా కాటాక్వెరా, డిపోర్టివో క్విక్ మధ్య మ్యాచ్ మధ్యలో లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మ్యాచ్ 66వ నిమిషంలో జేవియర్ బొలివర్ కు రిఫరీ రెడ్ కార్డ్‌ను చూపించింది. కార్డు చూపిస్తుండగానే అతడు రిఫరీ సెబాలోస్ వైపుగా కోపంతో వేగంగా ముందుకు దూసుకొచ్చి చెంప దెబ్బ కొట్టాడు. దీనికి కోపంగా స్పందించిన వెనెస్సా సెబాలోస్ అతడిని కొట్టడానికి కోపంగా దూసుకెళ్లింది. ఇంతలో అక్కడ ఉన్న ప్లేయర్ గొడవ జరగకుండా ఆ రిఫరీను వెనక్కి లాగాడు. బోలివర్ చేసిన పనికి అక్కడ ఉన్న ఆటగాళ్లు కోపంగా స్పందించారు. గోల్ కీపర్లలో ఒకరు కోపంగా అతన్ని అక్కడ నుంచి దూరంగా నెట్టాడు.
మ్యాచ్ తర్వాత తాను చేసిన పనికి జేవియర్ బొలివర్ క్షమాపణలు చెప్పాడు. సెబాలోస్‌ను ఉద్దేశపూర్వకంగా చెంపదెబ్బ కొట్టలేదని చెప్పాడు. ఆమె నోటి నుండి విజిల్ తీయడానికి ప్రయత్నించే క్రమంలో ఆమె చెంప తగిలిందని అన్నాడు. ఏ సమయంలోనూ రిఫరీ పట్ల శారీరకంగా దూకుడుగా ప్రవర్తించలేదని.. తన సంజ్ఞ అభ్యంతరకరంగా ఉందని తప్పు ఒప్పుకున్నాడు. ఆమె కుటుంబంతో పాటు దాని వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నేను వినయంగా క్షమాపణలు కోరుతున్నానని బొలివర్ చెప్పాడు.
🇨🇴 Referee #VanessaCeballos in #Colombia was slapped in the face by a player who received a red card. pic.twitter.com/uCND8y8Kml
— Ian Collins (@Ian_Collins_03) September 3, 2025