మార్నింగ్ వాక్ కోసం రోడ్డు మొత్తం బ్లాక్

మార్నింగ్ వాక్ కోసం రోడ్డు మొత్తం బ్లాక్


కొచ్చి: కేరళలోని కొచ్చిలో ఓ పోలీసు అధికారి.. మార్నింగ్ వాకింగ్ చేయడానికి ఏకంగా రోడ్డు మొత్తం బ్లాక్ చేయించిండు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్​ వినోద్ పిళ్లై కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రతిరోజు తన ఇంటి దగ్గర్లోని క్వీన్ వాక్ వేపై  మార్నింగ్ వాక్​ చేస్తుంటారు. దానికోసం రోడ్డుకు అడ్డంగా బారీకేడ్ పెట్టించి స్థానిక ప్రజలను, వాహనాలను దారి మళ్లిస్తున్నారు. క్వీన్స్‌‌ వాక్‌‌వేలో ప్రతి ఆదివారం పిల్లలు, యువకులు సైక్లింగ్‌‌, స్కేటింగ్‌‌ ప్రాక్టిస్ చేయడానికి ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఒక భాగం రోడ్డును మూసివేస్తారు. అయితే, వినోద్‌‌ పిళ్లై మాత్రం ప్రతిరోజూ రోడ్డును మూయించి.. మార్నింగ్‌‌ వాక్‌‌ చేయడం మొదలుపెట్టారు. దాంతో  స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరెంట్స్.. తమ పిల్లల్ని స్కూల్‌‌ బస్సు ఎక్కించడానికి అర కిలోమీటర్‌‌ నడిచి వెళ్లాల్సి వస్తోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ఆయన మాత్రం దర్జాగా వాకింగ్ చేస్తున్నారు. దీంతో వినోద్ పిళ్లై మార్నింగ్ వాక్‌‌తో కలుగుతున్న ఇబ్బందులను, ఫొటోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైర‌‌ల్ అయ్యాయి. పిళ్లై నిర్వాకం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన పై ఆఫీసర్లు పిళ్లైకి నోటీసులు జారీ చేశారు.