వరదలకు ఏకంగా పోలీస్ స్టేషనే కొట్టుకపోయింది

వరదలకు ఏకంగా పోలీస్ స్టేషనే కొట్టుకపోయింది

అసోం: జనమంతా చూస్తుండగానే ఓ పోలీస్ స్టేషన్ వరదల్లో కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలోని నల్బరీ జిల్లా భంగనమరిలో జరిగింది. వారం రోజులుగా  అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద నీటి ప్రవాహంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. భంగనమరి ప్రాంతం కూడా పూర్తిగా జలమయమైపోయింది.  ఈ క్రమంలోనే భంగనమరి చెరువు ఒడ్డున ఉన్న పోలీస్ స్టేషన్  నీటి ప్రవాహ వేగానికి పూర్తిగా దెబ్బతిన్నది. వరద ఉధృతి అంతకంతకూ పెరగడంతో ఏకంగా పోలీస్ స్టేషన్ వరద నీటిలో కొట్టుకుపోయింది. అసోంలో వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో  ఈ దృశ్యం చూస్తే అర్థమవుతుంది. 

కాగా... వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 134కి చేరింది. కరెంట్ సరఫరా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. కనీసం తాగునీరు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.