ఒంగోలులో ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఒంగోలులో ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్

బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. జనవరి 12న విడుదలవుతున్న సందర్భంగా శుక్రవారం ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇదే వేదికపై సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ట్రైలర్ లాంచ్ చేసి టీమ్‌‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్, అఖండ చిత్రాల తరహాలో.. ఈ సినిమా కూడా చరిత్రలో నిలిచిపోయేది అవుతుంది. అందంతో పాటు పెర్ఫార్మెన్స్‌‌తో మెప్పించింది శ్రుతిహాసన్. ఇందులో ఆమె ఫైట్స్ కూడా చేసింది. మలయాళ నటి హనీ రోజ్ క్యారెక్టర్ సర్‌‌‌‌ప్రైజ్ చేస్తుంది. దునియా విజయ్ కన్నడలో హీరో అయినప్పటికీ ఇందులో విలన్‌‌గా నటించడం.. తెలుగు, కన్నడ ఇండస్ట్రీల స్నేహానికి నిదర్శనం. తమన్ మ్యూజిక్‌‌కి ‘అఖండ’ తరహాలో మళ్లీ సౌండ్‌‌ బాక్సులు బద్దలవుతాయి. పవర్‌‌‌‌ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు సాయిమాధవ్ బుర్రా. సినిమాపై ఎంతో ప్యాషన్‌‌తో నిర్మించారు నవీన్ యెర్నేని, రవిశంకర్. అప్పుడప్పుడు కొన్ని గ్రహాలు కలిసి ఒక విస్ఫోటనం జరుగుతుంది. అలాంటి ఓ విస్ఫోటనమే ఈ ‘వీరసింహారెడ్డి’’ అన్నారు. ‘బాలయ్య గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఆయనతో వర్క్ చేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

గోపీచంద్‌‌తో, మైత్రి సంస్థతో నాకిది మూడో సినిమా. టాలీవుడ్‌‌లో గోపీ నాకు అన్నయ్యలా  నిలిచారు’ అంది శ్రుతి. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘ఇరవై నాలుగేళ్ల క్రితం ‘సమరసింహారెడ్డి’ని బాలయ్య ఫ్యాన్‌‌లా చూశా. ఈరోజు ఆయన్ను డైరెక్ట్ చేశానంటే జీవితానికి ఇంతకంటే ఏంకావాలి. ఫ్యాన్స్‌‌ బాలయ్యను ఎలా చూడాలనుకుంటారో అదే విధంగా దీన్ని తీశాను. శ్రుతి నాకు లక్కీ హీరోయిన్. బాలయ్యను ఢీకొట్టే పాత్రలో వరలక్ష్మి నటన  సూపర్బ్‌‌గా ఉంటుంది.  నిర్మాతలు బ్యాక్‌‌ బోన్‌‌లా సపోర్ట్ చేశారు’ అన్నాడు.  బాలకృష్ణ గారితో వర్క్ చేయడం  డ్రీమ్ కమ్ ట్రూలా అనిపిస్తుందన్నారు నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి. నటులు దునియా విజయ్,  చంద్రిక రవి, హనీ రోజ్,  సప్తగిరి, అజయ్ ఘోష్,  రైటర్ సాయిమాధవ్ బుర్రా, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, వెంకట్, సింగర్ మనో తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.