
ఇంట్లోకి కొండచిలువ రావడంతో ఒక్కసారిగా ఆ ఇంటి సభ్యుల గుండెలు గుభేలుమన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్టు తండాలోని ఓ ఇంట్లోకి కొండచిలువ ప్రవేశించింది. ఎక్కడి నుండి వచ్చిందో, ఎలా వచ్చిందో తెలియదు గానీ దాదాపు 7 నుంచి 8 అడుగుల పొడువున్న ఆ కొండచిలువ ను చూసి కుటుంబ సభ్యులు భయాందళోనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్థానికుల సలహాతో అటవీ అధికారులకు సమాచారమందించారు. ఆ కొండచిలువను బంధించి జనావాసాలకు దూరంగా ఏదైనా అటవీ ప్రాంతంలో వదిలెయ్యాలని విజ్ఞప్తి చేశారు.