ప్రజా పాలనలో గుణాత్మక మార్పు వచ్చింది..సీఎం రేవంత్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శం: ఎంపీ మల్లు రవి

ప్రజా పాలనలో గుణాత్మక మార్పు వచ్చింది..సీఎం రేవంత్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శం: ఎంపీ మల్లు రవి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గడిచిన రెండున్నర సంవత్సరాల ప్రజా పాలనలో రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చిందని, నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని ఎంపీ మల్లు రవి తెలిపారు. మంగళవారం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో చేపట్టిన కులగణన కార్యక్రమం దేశానికే దిక్సూచిగా మారిందని, ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు సైతం సూచించిందని పేర్కొన్నారు. సమావేశంలో నాగర్‌‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్​ రెడ్డి ఉన్నారు.