ఏపీ మహిళా పోలీస్ అరుదైన ఘనత.. యూరప్లో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన రైల్వే డీఎస్పీ

ఏపీ మహిళా పోలీస్ అరుదైన ఘనత.. యూరప్లో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన రైల్వే డీఎస్పీ

కృషి, ప‌ట్టుద‌ల ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చునని నిరూపించారు రైల్వే డీఎస్పీ హర్షిత మణికంఠ. యూరప్‌లోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ (Elbrus) శిఖరాన్ని అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. యూరెప్ లోని 5,642 మీటర్లు ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాను రెపరెపలాడించారు. 

డీఎస్పీ హర్షిత యూరప్ లో ఎత్తైన శిఖరాన్ని ఎక్కి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు గౌరవాన్ని తీసుకొచ్చారని అభినందించారు హోంమంత్రి అనిత.  డీఎస్పీ హర్షిత సాధించిన విజయం పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ప్రతి మహిళలకు స్ఫూర్తిదాయకం తెలిపారు. 

చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సతీమణి అయిన హర్షిత.. పట్టుదల, నిబద్ధతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె సాధించిన విజయం చిత్తూరు జిల్లాకు గర్వకారణం అని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.