కేసీఆర్ నాటకాలు ఆపు.. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చెయ్

కేసీఆర్ నాటకాలు ఆపు.. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చెయ్

కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్

కరీంనగర్: బీజేపీ తీసుకువచ్చిన 3 వ్యవసాయ బిల్లులు రైతులకు ఉరితాడు వంటివని.. ఈ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ తెలంగాణలో తీర్మానం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతు బిల్లుల ద్వారా పంటలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కేసీఆర్ నాటకాలు అడుతున్నాడని.. నాటకాలు ఆపి తెలంగాణలో వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఆయన సూచించారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి..  సీసీఐ ద్వారా తడిసిన పత్తిని కొనుగోలు చేయాలి.. సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ. 2500 మద్దతు ధర ఇవ్వాలన్నారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. రైతులను రాజులుగా చూడాలని కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాటలు ఘనం, అమలు మాత్రం శూన్యం అన్న తీరుగా ఉందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.