యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డ్రాగన్'. ఈ కాంబోలో వస్తున్న ఈ చిత్రం కోసం ఇటు నందమూరి అభిమానులు, అటు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ థీమ్, ఈ సినిమా కోసం తారక్ తగ్గిన బరువు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్‌పై దర్శకుడు ప్రశాంత్ నీల్ షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. తాను ఇప్పటివరకు రాసుకున్న కథలన్నింటికంటే ఇది అత్యంత డార్క్ ఫిల్మ్ అని ఆయన ప్రకటించారు.
'లూగర్'గా తారక్ సాహసం..
'డ్రాగన్' చిత్రంలో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్ర పేరు 'లూగర్'.ఈ పాత్రకు సంబంధించిన విషయాలను ప్రశాంత్ నీల్ పంచుకుంటూ.. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇదొక అత్యంత ధైర్యమైన నిర్ణయమని కొనియాడారు. ఎన్టీఆర్ లాంటి ఒక తిరుగులేని మాస్ ఇమేజ్, స్టార్డమ్ ఉన్న నటుడు ఇంతటి రిస్కీ, డార్క్ క్యారెక్టర్‌ను ఒప్పుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం అని అన్నారు.. నా కెరీర్లో నేను రాసిన అన్ని పాత్రల కంటే ‘లూగర్’ పాత్ర అత్యంత క్రూరంగా, ఇంటెన్స్‌గా ఉంటుంది అని నీల్ చెప్పుకొచ్చారు.
మూడేళ్ల కష్టం..
ఈ పాత్ర వెనుక ఉన్న ఎమోషనల్ కోణాన్ని పర్ఫెక్ట్గా స్క్రీన్‌పైకి తీసుకురావడానికి చిత్ర బృందానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టిందని నీల్ వెల్లడించారు. తారక్ పాత్ర చేసే పనుల వెనుక ఉన్న బలమైన ఎమోషనల్ రీజన్స్‌ని రాబట్టడానికి మాకు మూడేళ్లు పట్టింది. కథ మొత్తం ఒక కొలిక్కి వచ్చాక.. ఈ క్యారెక్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆశ్చర్యపరుస్తుందని తెలిసినప్పటికీ, తారక్ కథ వినగానే ఒక్క మాటలో ‘లెట్స్ డూ ఇట్’ అని సైన్ చేసేశారు అని దర్శకుడు తెలిపారు.
కథేంటి?
ఒక భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్‌కు సంబంధించిన 'లూగర్' అనే ఆపరేటివ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని, ఆ సిండికేట్‌పై ప్రభుత్వం జరిపే భారీ క్రాక్‌డౌన్ నేపథ్యంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, బిజు మీనన్, అశుతోష్ రాణా, సిద్ధాంత్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలన్ పాత్ర కోసం బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ పేరు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ మూవీ జూన్ 11, 2027 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి 'డ్రాగన్' మేకర్స్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
