ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో యూజర్ల సేఫ్టీ కోసం వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. OTPలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం దొంగిలించేందుకు మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్న సమయంలో ఈ ఫీచర్లు యూజర్లకు ఎక్స్ ట్రా సెక్యూరిటీని అందిస్తాయి.
వాట్సాప్‌లో ఇప్పుడు Silence Unknown Callers అనే ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ తో తెలియని నంబర్ల నుంచి వచ్చే స్కామ్ కాల్స్ ఆటోమేటిక్‌గా సైలెంట్ అవుతాయి. అంతేకాదు అన్ నౌన్ నంబర్ల నుంచి మేసేజ్ వస్తే Context Cards ద్వారా ఆ నంబర్ గురించి అదనపు సమాచారం అందిస్తుంది.
చాలా మంది స్క్రీన్ షేర్ చేస్తూ OTPలు, బ్యాంకింగ్ వివరాలు కోల్పోతున్నారు. ఇందుకోసం వీడియో కాల్స్ సమయంలో స్క్రీన్ షేర్ చేయడానికి ప్రయత్నిస్తే వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు ఎవరైనా మీ వాట్సాప్ ఖాతాను వేరే డివైజ్ కు లింక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే అలర్ట్ వస్తుంది.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రెండు-దశల వెరిఫికేషన్ (Two-Step Verification) ఫీచర్ ద్వారా ఖాతాకు అదనపు సెక్యూరిటీ లభిస్తుంది. ఆరు అంకెల పిన్ లేకుండా ఖాతాలోకి ప్రవేశించకుండా సెక్యూరిటీ ఉంటుంది.
ఆన్ లైన్ మోసాలు పూర్తిగా తగ్గకపోయినా, యూజర్లు అప్రమత్తంగా ఉంటేనే సురక్షితం. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త భద్రతా ఫీచర్లు డిజిటల్ భద్రతలో కీలక అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
