ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు నా ఇంటిని కబ్జా చేశారు

ఎమ్మెల్యే  దానం నాగేందర్ అనుచరులు నా ఇంటిని కబ్జా చేశారు

ఖైరతాబాద్, వెలుగు: ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులు తన ఇంటిని కబ్జా చేశారని ఓ పారిశుధ్య కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో నారాయణమ్మ మాట్లాడారు. గత 20 ఏండ్లుగా జీహెచ్‌‌‌‌ఎంసీలో పారిశుధ్య కార్మికురాలిగా సేవలందిస్తున్నానని తెలిపారు.

 వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫిలింనగర్ లోని​వినాయక నగర్​లో ప్రభుత్వం తనకు కేటాయించిన 120 గజాల స్థలాన్ని దానం అనుచరులు కబ్జా చేసి, దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇంటిని ఖాళీ చేయించి, తన రేషన్​కార్డును కూడా రద్దు చేశారన్నారు. దీనిపై ప్రజాభవన్​లో ఫిర్యాదు చేస్తే, పోలీసు కమిషనర్​కు సిఫార్సు చేశారన్నారు. కమిషనర్​ డీసీపీ రాస్తే , డీసీపీ ఏసీపీకి, ఏసీపీ సీఐకు రాసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్​రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని నారాయణమ్మ కోరారు.