ఒంటరి పయనంలో తోడై నడిచావులే

ఒంటరి పయనంలో తోడై నడిచావులే

‘దూరమే తీరమై నింగి తాకే నేలని.. తారలే చేరువై నన్ను చేరె ఆమని.. కళ్ల ముందరుంది నేడిలా..  ఎలా.. నీకు నిన్ను చేరువైన ఈ క్షణం ప్రేమగా’ అంటూ డ్యూయెట్ సాంగ్ పాడుకుంటున్నారు కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్. వీరిద్దరూ జంటగా అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందించిన ‘డెవిల్’ చిత్రంలోని పాట ఇది. సోమవారం విడుదల చేసిన ఈ మెలోడీ సాంగ్‌‌‌‌లో కళ్యాణ్ రామ్, సంయుక్త ట్రెడిషినల్ లుక్స్‌‌‌‌లో ఆకట్టుకుంటున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన పాటకు సమీర భరద్వాజ్ లిరిక్స్ రాయడంతోపాటు తనే స్వయంగా పాడింది.

‘ఇంతకు ముందులా లేనే లేనుగా.. చెంతకు చేరి నన్నే మార్చేశావుగా.. ఒంటరి పయనంలో తోడై నడిచావులే’ అంటూ సాగిన పాట సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. బ్రిటీష్  సీక్రెట్ ఏజెంట్‌‌‌‌ ట్యాగ్‌‌‌‌లైన్‌‌‌‌తో తెరకెక్కిన  స్పై థ్రిల్లర్ ఇది.  పీరియాడికల్‌‌‌‌ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సినిమా ఉంటుంది. శ్రీకాంత్ విస్సా కథ, మాటలు,  స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. డిసెంబర్ 29న తెలుగుతో పాటు త‌‌‌‌మిళ, క‌‌‌‌న్నడ, హిందీ భాష‌‌‌‌ల్లో సినిమా విడుదల కానుంది.