వామ్మో .... 25 పదాలు 157 అక్షరాలతో పేరు పెట్టారు

వామ్మో ....  25 పదాలు 157 అక్షరాలతో పేరు పెట్టారు

రాజు అంటే ఆ  రాజ్యంలో అన్నీ అధికారాలు అతనివే.. అతని ఏదంటే అది జరిగితీరాల్సిందే.  కాని ఇంగ్లండ్ రాజు జేమ్స్ IIకి సంబంధించిన పూర్వీకులను కలిగిన ఉన్న స్పెయిన్ లోని ఆల్బా రాజ్య వారసుడు..17వ హ్యూస్కర్‌ డ్యూక్‌ ఫెర్నాండో ఫిట్జ్‌-జేమ్స్‌ స్టువర్ట్(Duke Fernando Fitz-James Stuart), సోఫియా(Sofia Palazuelo) దంపతులకు పుట్టిన బిడ్డ పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయమని అక్కడి అధికారులు షాక్ ఇచ్చారు.  దీంతో మరీ అంత పెద్ద పేరును రిజిస్టర్ చేయలేం అంటూ ప్రభుత్వ అధికారులు సదరు రాజకుటుంబానికి షాక్ ఇచ్చారు.ఇంతకీ ఎవరా రాజకుటుంబం..ఆ బిడ్డ ఎవరు..? ఆ పేరు ఏమి..? అనే ఆసక్తికర విషయాలు చూసేద్దాం..

ఈ రోజుల్లో చాలామంది తమ పిల్లల పేర్లు వెరైటీగా ఉండాలని అనుకుంటారు.  కొంతమంది దేవుళ్ల పేర్లు.. మరికొంతమంది పూర్వీకుల పేర్లు కలసి వచ్చేలా తమ బిడ్డలకు పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు అలానే  ఓ రాజకుటుంబానికి చెందిన జంట మాత్రం తమ బిడ్డకు పేరు భారీగా ఉండేలా పెట్టుకున్నారు. . కానీ పెట్టిన పేరుతో పిల్లల్ని ఎవ్వరు పిలవరనుకోండి.. ముద్దుగా ఏదోక పేరు పెట్టుకుని పిలుచుకుంటుంటారు. చిన్న చిన్న పేర్లు పెట్టుకోవటం ట్రెండ్ గా మారిన ఈరోజుల్లో ఓ రాజకుటుంబానికి చెందిన జంట మాత్రం తమ బిడ్డకు పేరు భారీగా ఉండేలా పెట్టుకున్నారు. ఏకంగా దాదాపు రెండు మూడు లైన్లు ఉండే పేరు పెట్టారు. 


ఇంగ్లండ్ రాజు జేమ్స్ IIకి సంబంధించిన పూర్వీకులను కలిగిన ఉన్న స్పెయిన్ లోని ఆల్బా రాజ్య వారసుడు..17వ హ్యూస్కర్‌ డ్యూక్‌ ఫెర్నాండో ఫిట్జ్‌-జేమ్స్‌ స్టువర్ట్(Duke Fernando Fitz-James Stuart), సోఫియా(Sofia Palazuelo) దంపతులకు ఇటీవల పాప పుట్టింది. ఆ పాపకు ఆ దంపతులు అత్యంత భారీగా ఏకంగా 25 పదాలతో కూడిన పేరు పెట్టారు. ఈ 25 పదాల్లోను ఏకంగా 157 అక్షరాలున్నాయి. దీంతో స్పెయిన్ ప్రభుత్వ అధికారులు అంత పెద్ద పేరును రిజిస్టర్ చేయలేం అని తేల్చి చెప్పారు.

ఇంతకీ ఆ పేరు ఏమిటంటే…సోఫియా ఫెర్నాండా డొలొరెస్‌ కయెటనా టెరెసా ఏంజెలా డీ లా క్రుజ్‌ మికేలా డెల్‌ శాంటిసిమో సక్రామెంటో డెల్‌ పర్పెటువో సొకొర్రో డీ లా శాంటిసిమా ట్రినిడాడ్‌ వై డీ టొడొస్‌ లాస్‌ సాంటోస్‌'(Sofía Fernanda Dolores Cayetana Teresa Ángela de la Cruz Micaela del Santísimo Sacramento del Perpetuo Socorro de la Santísima Trinidad y de Todos Los Santos) వారి దివంగత కుటుంబ సభ్యులు, మరియు మతపరమైన భక్తి పరమైన అంశాలను తీసుకుని ఈ రాజకుటుంబీకులు ఇంత పెద్ద పేరు పెట్టుకున్నారట.

ఈ పాప మొదటి పేరులో సోఫియా అనేది ఆమె తల్లి అంటే చంటిపాప అమ్మ్మ పేరులోని సోఫియా బరోసాలోని పేరు కాగా రెండో పదం ఫెర్నాండా అనేది ఆమె తండ్రి డ్యూక్ ఆఫ్ హ్యూస్కార్ పేరు..అలాగే ఆమె ముత్తాత, ఇలా అందరి పేర్లు కలపగా ఇలా 25 పదాలతో 157 అక్షరాల పేరు అయ్యింది.ఈ దంపతులకు 2023, జనవరి10 పాప జన్మించింది. ఈ పాపకు ఇంత పెద్ద పేరు పెట్టారు రాజ దంపతులు. వారి వారి కుటుంబ సభ్యులపై ఉన్న గౌరవం..భక్తి వెరసి పెట్టిన ఇంత పెద్ద పేరు వారి ఇష్ట ప్రకారం పెట్టుకున్నారు. కానీ ఈ పేరు అధికారికంగా అంటే లీగల్ గా రిజిస్టర్ చేసే విషయంలో చిక్కులొచ్చిపడ్డాయి.

ఈ పేరును అధికారికంగా రిజిస్టర్‌ చేసేందుకు స్పెయిన్‌ అధికారులు మాత్రం అంగీకరించడంలేదు. నిబంధనలకు లోబడి చిన్నగా ఉండే పేరును కూతురికి పెట్టుకోవాలని, అప్పుడే రికార్డుల్లో నమోదు చేస్తామని రాకుమారుడికి అధికారులు సూచించారు. పేరు చట్టబద్దంగా నమోదు కావాలంటే చిన్నగా మార్చాలని సూచిస్తున్నారు. దీనిపై రాకుమారుడు స్పందించాల్సి ఉంది. కాగా..డ్యూక్  వివాహం 2018లో మాడ్రిడ్‌లోని ఫెర్నాండో ఫిట్జ్-జేమ్స్ స్టువర్ట్ ఫ్యామిలీ ఎస్టేట్‌లో విలాసవంతంగా జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. రెండో పాప గత జనవరిలో జన్మించింది. డ్యూక్ దివంగత డచెస్ ఆఫ్ ఆల్బా యొక్క ఎనిమిది మంది మనవరాళ్లలో ఒకరు.ఈమెను స్పెయిన్ లోనే అత్యంత ధనిక మహిళగా పేరొందారు.

Also Read :- ఆలేరు చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు స్వాధీనం