రేజర్ ఏ మేన్ థింగ్ పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రేజర్ ఏ మేన్ థింగ్ పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వెరైటీ సబ్జెక్టులతో  వరుస సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందుకుంటున్నాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం తను నటిస్తున్న చిత్రం  ‘శ్వాగ్’. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీవిష్ణు కనిపించబోతున్నాడు. హసిత్ గోలి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని పాత్రలను పరిచయం చేసిన మేకర్స్ సినిమాపై ఆసక్తిని పెంచారు. తాజాగా  ‘రేజర్ ఏ మేన్ థింగ్’ పేరుతో శుక్రవారం స్పెషల్ వీడియోను రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

ఇందులో శ్రీవిష్ణు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశాడు. ముఖ్యంగా పెద్ద వయసున్న భవభూతి అనే ముసలివాడి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన మేకోవర్ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసేలా ఉంది. మగవారి గురించి స్ట్రాంగ్ స్టేట్మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రారంభమైన వీడియో ఆకట్టుకుంటుంది. ఎవరైనా మగవాడినే అనుసరించాలని డైలాగ్ చెబుతూ.. జస్ట్ కిడ్డింగ్ అంటూ తను చేసిన పెర్ఫార్మెన్స్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది.  త్వరలోనే టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.  రీతూ వర్మ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.