సింగపూర్​లో దివ్యాంగులకు స్పెషల్ విలేజ్

సింగపూర్​లో దివ్యాంగులకు స్పెషల్ విలేజ్
  • ఇన్నోవేషన్​ సెక్టార్​లో కీ రోల్
  • వ్యాపారాలు నిర్వహిస్తూ.. ఇతరులకు ట్రైనింగ్
  • ‘ఎనేబ్లింగ్​ విలేజ్’ పేరుతో గ్రామం​

సింగపూర్ : సింగపూర్​లో దివ్యాంగులకూ ఓ విలేజ్ ఉంది. అక్కడ ఉండే సూపర్ మార్కెట్లు, షాపింగ్​ మాల్స్ స్పెషల్​గా ఉంటాయి. స్లైడింగ్​ డోర్లు, నడిచేందుకు వీలుగా దారులు, వీల్​చైర్​లతో నెట్టగలిగే ట్రాలీలు ఇక్కడ కనిపిస్తాయి. వాష్​రూమ్​లపై బ్రెయిలీ అక్షరాలతో సైన్​లు, ఫ్లోర్​పై టచెబుల్ ఇండికేటర్స్​ ఉంటాయి. ఎవరి సాయం లేకుండా అంధులే తమ పని చక్కబెట్టుకునే ఫెసిలిటీస్​ఈ విలేజ్​లో ఉంటాయి. ‘ఎనేబ్లింగ్​ విలేజ్’ లేదా ‘ఈవీ’అని పిలవబడే ఈ గ్రామంలో ది వ్యాంగులకు స్పెషల్​ స్టేటస్​ ఉంది. దివ్యాంగులను స మాజంలో భాగస్వాములను చేసేందుకు ఈ విలేజ్​ను ఏర్పాటు చేసినట్లు ఎస్​జీ ఎనేబుల్​ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ కు జియోక్ బూన్ తెలిపారు. ఇక్కడ ఉండే దివ్యాంగులు ఇతరులకు ట్రైనింగ్​ ఇస్తుంటారు. మరికొందరు వ్యాపారాలు చేస్తుంటారు. ఈవెంట్స్, కమ్యూనిటీ సర్వీసెస్​లు కూడా కీలక పాత్ర పోషిస్తుంటారు. 

విదేశీయులను ఆకర్శిస్తున్న ‘ఈవీ’

తమ సమిష్టి కృషి ద్వారా.. మరింత మంది దివ్యాంగులు మెరుగైన, అర్థవంతమైన జీవితాలు గడుపు తారని ఆశిస్తున్నట్లు బూన్​ తెలిపారు. మరిన్ని అద్భుతమైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగాలతో పాటు ఇంటర్వ్యూలకు ఎలా అటెండ్​ కావాలన్న అంశాలపై శిక్షణ, వర్క్​షాపులు ఏర్పాటు చేస్తా రని వివరించారు. ఎంతో అనుభవం ఉన్న వ్యాపారులు, ట్రైనర్స్, నిపుణులను ఒక చోట చేర్చడమే తమ లక్ష్యమని బూన్​ తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చే విజిటర్స్​ను ‘ఈవీ’ ఎంతో ఆకర్షిస్తున్నదన్నారు. లోకల్​తో పాటు ఇంటర్నేషనల్​ గెస్ట్​లకు అతిథ్యం ఇస్తున్నదని వివరించారు. టెక్నాలజీతో కూడిన ఈ సమాజం దివ్యాంగులను ఎలా కలుపుకుని ముందుకు తీసుకెళ్లగలదో చెప్పాలనుకుంటున్నామని తెలిపారు. దివ్యాంగులు అందరికీ స్ఫూర్తిగా నిలిచేలా చేయడమే లక్ష్యమని చెప్పారు. సరికొత్త సేవలు అందుబాటులోకి తీసుకురావడం, వారి మధ్య ఉన్న గ్యాప్​ను తొలగించాలనే ఎనేబ్లింగ్​ విలేజ్​ను ఏర్పాటు చేశామని బూన్​ వివరించారు.