పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహన్ని పెట్టాలన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహన్ని పెట్టాలన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

ఖైరతాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహన్ని తిరిగి పెట్టాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. పంజాగుట్ట చౌరస్తాలో ఈ నెల 6న మాల మహానాడు, పంజాగుట్ట అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టే నిరాహార దీక్ష పోస్టర్‌‌‌‌‌‌‌‌ను ఆయన బుధవారం విడుదల చేశారు. మూడేండ్ల కింద పంజాగుట్టలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి, డంపింగ్ యార్డులో పడేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అక్కడ విగ్రహం పెట్టకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. తిరిగి అదే ప్లేసులో అంబేద్కర్ విగ్రహం పెట్టే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 6న నిర్వహించే నిరాహార దీక్షకు రెండు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున ప్రజలు వచ్చి మద్దతు తెలపాలని కోరారు. అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టే వరకు అన్ని సంఘాలను సమన్వయం చేసుకుని ఉద్యమాన్ని ఉదతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శ్రీధర్ రావు, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ శశికాంత్, పంజాగుట్ట విగ్రహ కమిటీ అధ్యక్షుడు పుణ్య భాను ప్రకాశ్‌‌‌‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కాడారి వినయ్ కుమార్, రమేశ్‌‌‌‌ మణిదీప్, ప్రమోద్, శివ తదితరులు పాల్గొన్నారు. 

ఘనంగా వివేక్ వెంకట స్వామి బర్త్​ డే

మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పుట్టిన రోజు సందర్భంగా దళిత సంఘాల నేతలు కేక్ కట్ చేశారు. ఇలాంటి పుట్టిన రోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎంతో మంది దళితులకు సిటీ నడి బొడ్డున సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాకా దేనన్నారు. ఆయన బాటలోనే వివేక్ ఎన్నో సంస్థలు నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారని, కాకా ఆశయాలు వివేక్‌‌‌‌తోనే నెరవేరుతాయని పేర్కొన్నారు.