తిప్పాయిపల్లి ఆలయ భూమి వేలం

తిప్పాయిపల్లి ఆలయ భూమి వేలం

పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు మండలంలోని తిప్పాయిపల్లె గ్రామ అంజనేయ స్వామి ఆలయ భూమిని బుధవారం ఎండోమెంట్​ అధికారులు వేలం నిర్వహించారు. సర్వే నంబర్​ 322లో 11.-02 ఎకరాలు, 323/1లో 12.-03 ఎకరాలతో కలిపి 23.05 ఎకరాల భూమి ఉంది. సరైన ఆదాయం లేక ఆంజనేయస్వామి గుడిలో ధూప దీప నైవేద్యాలు, పూజా కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు, దేవాదాయ శాఖ అధికారులు ఆదాయం సమకూర్చేందుకు ఆలయ భూమిని సాగు చేయాలని నిర్ణయించారు. 

మొత్తం భూమిని రెండేళ్ల కోసం బహిరంగ వేలం నిర్వహించగా ఏడాదికి రూ.4.17 లక్షల చొప్పున కొంత మంది రైతులు వేలం పాడి సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎస్సై యుగంధర్ రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండోమెంట్​ ఏసీ మదనేశ్వర్  రెడ్డి, ఇన్స్​పెక్టర్  వెంకటేశ్వరమ్మ, ఆంజనేయులు, సత్యచంద్రారెడ్డి, గ్రామస్తులు మహేశ్వర్ రెడ్డి, ఎల్ల స్వామి, వీరస్వామి పాల్గొన్నారు