కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక : కాంగ్రెస్ నేత నీలం మధు

కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక : కాంగ్రెస్ నేత నీలం మధు

 పటాన్​చెరు, వెలుగు: కార్యకర్తల అభీష్టం మేరకే సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. బుధవారం అశోక్ నగర్ లోని సితార గ్రాండ్ హోటల్ లో ఏఐసీసీ అబ్జర్వర్ సజరిట లైత్ ప్లాంగ్, పీసీసీ అబ్జర్వర్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు ఆధ్వర్యంలో పటాన్ చెరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మధు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడం శుభపరిణామన్నారు. 

ఈ ప్రక్రియ ద్వారా పార్టీ కోసం కష్టపడే నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే వెసలుబాటు కలుగుతుందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్​జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా కలిసి పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ముజాహిద్ ఆలం ఖాన్, గాలి అనిల్ కుమార్, నియోజకవర్గ ఇన్​చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, శశికళ యాదవరెడ్డి, ఐఎన్​టీయూసీ  జిల్లా అధ్యక్షుడు నరసింహ రెడ్డి పాల్గొన్నారు.