మెదక్ జిల్లాను బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లాను బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  •  కలెక్టర్​ రాహుల్ రాజ్​

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ జిల్లాను బాల్యవివాహా రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్​రాహుల్​రాజ్​సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో​ బాల్య వివాహాలు జరగకుండా ఆలయాల్లో అతికించే నోటీసు పోస్టర్లను ఆవిష్కరించారు.  అనంతరం మాట్లాడుతూ.. చిన్న వయసులో బాలికలకు పెళ్లి చేయకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో హేమభార్గవి, విజన్ సంస్థ డైరెక్టర్  కైలాస్, సంస్థ జిల్లా ప్రాజెక్టు కో- ఆర్డినేటర్ రాజు, సిబ్బంది యాదగిరి, సంజీవ్, నవనీత పాల్గొన్నారు.

 అనంతరం సామాజిక పెన్షన్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎంపీడీవోలు, ఎంసీఎస్​లు, జీపీ కార్యదర్శులు, బిల్​కలెక్టర్లు, పోస్టల్​అధికారులు, సెక్షన్​ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. అర్హులకే పింఛన్లు మంజూరుచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ నగేశ్​, జడ్పీ సీఈవో ఎల్లయ్య, సెర్ఫ్​ డైరెక్టర్​ గోపాల్ రావు, డీఆర్డీవో శ్రీనివాస్​ రావు, డీపీవో యాదయ్య, ఎంపీడీవోలు, ఎంసీఎస్ లు, జీపీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ అధికారులు, సెక్షన్ అసిస్టెంట్ అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి

జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​, ఎస్పీ శ్రీనివాస్​ రావు ఆదేశించారు. కలెక్టరేట్​లోని రోడ్డు భద్రతపై జిల్లా స్థాయి అధికారులతో సమావేశం  నిర్వహించారు.  కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో రహదారి భద్రతా చర్యలు కీలకమైనవన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నివారించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్లు సరిగా లేని చోట్ల వెంటనే రిపేర్లు చేయించాలన్నారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.