చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. బతికున్న వ్యక్తిని చూసి అందరూ షాక్

చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. బతికున్న వ్యక్తిని చూసి అందరూ షాక్

వికారాబాద్ జిల్లా: చోరీకి గురైన సెల్ ఫోన్ ఓ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఫోను చోరీ చేసిన వ్యక్తి రైలు కింద పడి చనిపోవడంతో బతికున్న వ్యక్తి చనిపోయినట్లుగా భావించారు. అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కడసారి చూపు చూ చూసేoదుకని బంధువులు మిత్రులు అందరూ వచ్చేశారు. అంత్యక్రియలకు తరలించేందుకు పాడి ఎక్కించే సమయంలో అసలు వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అది చూసి కుటుంబ సభ్యులు బంధువులు అంతా అవాక్కైపోయారు.

వివరాలలోకి వెళితే.. బషీరాబాద్ మండలం నా వంద్గి గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప (45) పశువుల కాపరిగా పనిచేసేవాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయాడు. అయితే అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. ఫోన్ దొంగిలించిన వ్యక్తి  వికారాబాద్ సమీపంలో రైలు కిందపడి చనిపోయాడు. అతడి మొఖం పూర్తిగా చిద్రమైపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. రైల్వే పోలీసులు గమనించి అతడి వద్ద ఐడెంటిటీ కోసం తనిఖీ చేయగా ఫోన్ లభించింది. 
ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా నావంద్గీ గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించిన గుర్తుపట్టలేని విధంగా శవం ఉండడంతో  కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. ఎల్లప్ప చనిపోయిన సమాచారం బంధుమిత్రులందరికీ అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు బొందను కూడా తవ్వారు. నావంద్గి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చనిపోయాడనుకున్న పిట్టల ఎల్లప్ప తాండూరులో కనిపించాడు. అతనిని చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు.

దగ్గరికి వెళ్లి అతడిని పలకరించాడు. నువ్వు చనిపోయావు అనుకుని ఎవరిదో శవాన్ని తీసుకువచ్చి మీ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారని చెప్పడంతో అతడు షాక్ అయ్యాడు. అదే వ్యక్తితో కుటుంబ సభ్యులకు ఫోన్ చేయించి తాను బతికి ఉన్నట్లు తెలిపాడు. హుటాహుటిన గ్రామానికి వెళ్లి పోయాడు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి ప్రత్యక్షం కావడంతో బంధుమిత్రులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు అంతా సంతోషించారు. వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.