
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా ఎ.సుదర్శన్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైకోర్టులోని ఏజీ ఆఫీసులో పూజలు చేశాక ఏజీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఏజీలు తేరా రజనీకాంత్ రెడ్డి, ఇమ్రాన్ ఖాన్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.నాగేశ్వర్ రావు, ఇతర ప్రభుత్వ ప్లీడర్లు, సుదర్శన్‌రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు.
రెండో ఏఏజీగా ఇమ్రాన్ ఖాన్
సీనియర్ న్యాయవాది ఇమ్రాన్ ఖాన్‌ను రెండో అద నపు అడ్వొకేట్ జనరల్‌గా ప్రభుత్వం నియమించింది. గత నెల 30వ తేదీతో న్యాయ శాఖ జీవో జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ 1988లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2021లో సీనియర్ లాయర్ అయ్యారు. ఇప్పటికే అదనపు అడ్వొకేట్ జనరల్‌గా తేరా రజనీకాంత్ రెడ్డి నియమితులయ్యారు.