సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ టైర్ పేలి.. తృటిలో తప్పిన ప్రమాదం

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ టైర్ పేలి.. తృటిలో తప్పిన ప్రమాదం

వికారాబాద్  జిల్లా:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొడంగల్ పర్యటనలో భాగంగా ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరారు. సీఎం కావ్వాయ్ లోని ఓ ల్యాండ్ క్యూజర్ వాహనం టైర్ పేలి పంక్చర్ అయింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో తృటిలో తప్పిన ప్రమాదం తప్పింది. డ్రైవర్ కారును చాకఛక్యంగా పక్కకు ఆపేశాడు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీచ్చుకున్నారు.వెంటనే టైర్ మార్చి కొడంగల్ బయలుదేరారు.