హైదరాబాద్ లో 10లక్షల CC కెమెరాలను  ఏర్పాటు చేయాలి

హైదరాబాద్ లో 10లక్షల CC కెమెరాలను  ఏర్పాటు చేయాలి

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌జ‌లు ఎక్కువగా ఉండే ప్ర‌తీ దగ్గర సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయాల‌ని పోలీసుల‌కు సూచించారు మంత్రి కేటీఆర్ . అంతేకాకుండా న్యూ ఫ్లై ఓవ‌ర్లు, రోడ్లు, పార్కులు, బ‌స్తీ ద‌వాఖాన‌ల దగ్గర సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మ‌రింత సుర‌క్షితంగా న‌గ‌రంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కేటీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు.

త్వరలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రానున్న క్రమంలో …హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం నగరంలో ఉన్న సూమారు ఐదు లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలను ఇన్ స్టాల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో మొత్తం పది లక్షల కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌ర్లతో పాటు జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, అధికారులు పాల్గొన్నారు.