తండ్రి మీద కేసు వేసిన కొడుకు కథ.. సన్ ఆఫ్ టీజర్ విడుదల

తండ్రి మీద కేసు వేసిన కొడుకు కథ.. సన్ ఆఫ్ టీజర్ విడుదల

సాయి సింహాద్రి  హీరోగా నటిస్తూ   నిర్మిస్తున్న  చిత్రం ‘సన్ ఆఫ్’.  బత్తల సతీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వినోద్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, శుక్రవారం టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌లో సాయి సింహాద్రి మాట్లాడుతూ ‘ఈ కథ  రియల్ లైఫ్‌‌‌‌లో నాకు, మా నాన్నకు కనెక్ట్ అవుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునేలా ఎంతో ఎక్సయిటింగ్‌‌‌‌గా ఉంటుంది. 

ఇందులోని  డ్రామా, ఎమోషన్ ఆకట్టుకుంటుంది.  ప్రతి కొడుకు... తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది.   సీనియర్ నటుడు వినోద్ కుమార్ సపోర్ట్‌‌‌‌గా నిలిచారు’ అని చెప్పాడు.  దర్శకుడు సతీష్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం  వినోద్ కుమార్ గారికి మంచి  కమ్  బ్యాక్ అవుతుంది.  ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌లో  మరో ‘మామ గారు’ చిత్రంలా నిలిచిపోతుంది.  ఓ కొడుకు తండ్రి మీద కేసు ఎందుకు వేశాడు అనేది చాలా స్ట్రాంగ్‌‌‌‌గా చూపించాం’ అని అన్నాడు. వినోద్ కుమార్ మాట్లాడుతూ ‘తండ్రి, కొడుకుల మధ్య సాగే స్టోరీ ఇది.  స్ర్కీన్‌‌‌‌ప్లే బేస్డ్‌‌‌‌గా సాగుతుంది.  ఇందులో హీరోగా నటించిన  సాయి సింహాద్రి..  ఎక్కడో  పర్లాకిమిడిలో చదివి  అమెరికాకు వెళ్ళి  అక్కడి నుంచి వచ్చి ఈ సినిమా తీశారు.  కచ్చితంగా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు. ‘చిత్రం’ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్  రిషి పాల్గొన్నారు.