శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి లీడ్ రోల్స్‌లో మురళీకాంత్ తెరకెక్కించిన చిత్రం ‘దండోరా’. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. తన అవ్వ శవాన్ని ఊరికి దూరంగా ఎందుకు తీసుకెళ్తున్నారని ఓ కుర్రాడు అడిగిన ప్రశ్నతో ట్రైలర్ మొదలైంది. ఓ వైపు సిటీ నుంచి నందు ఫ్యామిలీతో కలిసి వస్తుండడం, మరోవైపు అంత్యక్రియల కోసం కుల పెద్దల పంచాయితీ జరుగుతుంటుంది. కులపెద్ద తరహా పాత్రలో శివాజీ, సర్పంచ్‌గా నవదీప్ కనిపించారు.
రవికృష్ణ, మనికా చిక్కాల ప్రేమజంటగా నటించారు. ‘చావు నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ.. కులం నుంచి తప్పించుకోలేవు.. పెళ్లి, చావు దగ్గరే కదా వీళ్ల ఆటలు సాగేది.. రాత్రి తాగింది పొద్దునకు దిగడానికి ఇది కల్లు మత్తు కాదు, కులం మత్తు సార్ టైమ్ పట్టింది లాంటి డైలాగ్స్‌తో సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది.
