సికింద్రాబాద్ టూ విజయవాడ వెళ్తుండగా విషాదం..రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి

సికింద్రాబాద్  టూ  విజయవాడ వెళ్తుండగా విషాదం..రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  యాదగిరిగుట్ట మండలం వంగపల్లి - ఆలేరు మార్గంలో  రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందారు. డిసెంబర్ 18న రాత్రి  ఈ ఘటన జరగ్గా.. డిసెంబర్ 19న  శుక్రవారం ఉదయం  రైల్వే పోలీసులకు సమాచారం అందించారు రైల్వే ట్రాక్ మెన్ .

 ఘటనా స్థలానికి  రైల్వే పోలీసులు  మృతులు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం(25),భవాని(19) దంపతులుగా గుర్తించారు . మృతుడు సింహాచలం హైదరాబాద్ లోని ఓ కెమికల్ కంపనీలో పనిచేస్తూ జగద్గిరిగుట్టలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్నట్టు చెప్పారు.  విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ రైల్లో సికింద్రాబాద్ నుంచి డిసెంబర్ 18న రాత్రి బయలుదేరారు దంపతులు.   రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తరువాత డోర్ దగ్గర  నిలబడి ఉన్న ఇద్దరు దంపతులు  జారిపడి మృతి చెందినట్టు తెలిపారు  రైల్వే పోలీసులు. ఈ   ఘటన పై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు  రైల్వే పోలీసులు.

పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా..కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొత్తగా పెళ్లైన దంపతులకు అపుడే నిండు నూరేళ్లు నిండిపోయాయా అంటూ విలపిస్తున్నారు.