బాహుబలి లాంటి సినిమా చేయాలనుంది:రకూల్

బాహుబలి లాంటి సినిమా చేయాలనుంది:రకూల్


తెలుగు సినిమాలను, తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మిస్‌‌‌‌ అవుతున్నానని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్.  తనకు తొలి విజయాన్ని ఇచ్చిన తెలుగులో తప్పకుండా సినిమాలు చేస్తానని, అందుకు తగ్గ చక్కని స్టోరీ కోసం ఎదురుచూ స్తున్నానని,  ‘బాహుబలి’ లాంటి సినిమా చేయాలని ఉందని ఆమె చెప్పింది. కొంత గ్యాప్‌‌‌‌ తర్వాత హైదరాబాద్‌‌‌‌ వచ్చిన ఆమె..  పంజాగుట్టలో సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో అండ్ అకాడెమీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. 

ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ ‘కడాలి చక్రవర్తి గారు ఎనిమిదేళ్ల పాటు నాకు పర్సనల్‌‌‌‌ మేకప్‌‌‌‌ మ్యాన్‌‌‌‌గా వ్యవహరించారు. నేను తెలుగు ఇంతలా మాట్లాడటానికి ఈ అన్ననే కారణం.  మేకప్ అకాడమీ ప్రారంభించాలనే ఆయన కల ఈరోజు నెరవేరింది.  భవిష్యత్తులో ఆయన మరెన్నో బ్రాంచీలు ప్రారంభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని విషెస్‌‌‌‌ చెప్పింది.