హెచ్‌‌సీఏ ఎలక్షన్స్‌‌లో టఫ్‌‌ ఫైట్‌‌.. ఒక్కో పోస్టుకు నలుగురి పోటీ

హెచ్‌‌సీఏ ఎలక్షన్స్‌‌లో టఫ్‌‌ ఫైట్‌‌.. ఒక్కో పోస్టుకు నలుగురి పోటీ
  • హెచ్‌‌సీఏ ఎలక్షన్స్‌‌లో టఫ్‌‌ ఫైట్‌‌

హైదరాబాద్‌‌,వెలుగు: హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) ఎలక్షన్స్‌‌లో టఫ్‌‌ ఫైట్‌‌ నడుస్తోంది. ఒక్కో పోస్టు కోసం నలుగురు బరిలో నిలిచారు. ఈ నెల 20న జరిగే ఎలక్షన్స్‌‌ కోసం రిటర్నింగ్‌‌ ఆఫీసర్‌‌ సోమవారం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. నామినేషన్ల విత్‌‌డ్రా తర్వాత ప్రెసిడెంట్‌‌, సెక్రటరీ, ట్రెజరర్‌‌, జాయింట్‌‌ సెక్రటరీ, వైస్‌‌ ప్రెసిడెంట్‌‌, కౌన్సిలర్‌‌ పోస్టులకు ఒక్కోదానికి నాలుగు పానెళ్ల తరఫున నలుగురేసి అభ్యర్థులు బరిలో ఉన్నారు.

గుడ్​ గవర్నెన్స్​ ప్యానెల్​ తరఫున కె. అనిల్​ కుమార్​ ప్రెసిడెంట్‌‌గా, వి. ఆగం​ రావు సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. ఇతర ప్యానెల్స్‌‌ నుంచి ప్రెసిడెంట్‌‌ పోస్టుకు  జ‌‌గ‌‌న్‌‌మోహ‌‌న్ రావు, పీఎల్ శ్రీనివాస్, అమర్‌‌నాథ్‌‌ బరిలో ఉండగా.. సెక్రటరీ కోసం హ‌‌రినారాయ‌‌ణ, ఆర్. ఎం .భాస్కర్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.