ప్రేగ్‌ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. 11 మంది మృతి..9 మందికి గాయాలు

ప్రేగ్‌ యూనివర్సిటీలో కాల్పుల కలకలం..  11 మంది మృతి..9 మందికి గాయాలు

చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లోని ఓ యూనివర్సిటీలో గురువారం (డిసెంబర్ 21న) కాల్పుల కలకలం రేగింది.  ఓ ముష్కరుడు జరిపిన కాల్పుల్లో 11 మంది చనిపోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని అక్కడి  పోలీసులు తెలిపారు. 

కాల్పులు జరిపిన దుండగుడిని ఆ తర్వాత పోలీసులు కాల్చి చంపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అంతమొందించినట్లు చెక్ పోలీసులు చెప్పారు. ఘటనా స్థలంలోని బిల్డింగ్ ను మొత్తం ఖాళీ చేయించారు. విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్న వీధుల్లో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించారు.

ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన చార్లెస్ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్ భవనంలో ఈ కాల్పుల ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసుల యాక్షన్ ఇంకా కొనసాగుతున్నందున ఇళ్లలోంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. చార్లెస్ యూనివర్సిటీకి చెందిన ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్ మొత్తాన్ని ఖాళీ చేయిస్తున్నట్లు ప్రేగ్ నగర మేయర్ బొహుస్లావ్ స్వొబోడా చెప్పారు.