బిహార్‪లో కోర్టు ఆవరణంలో పేలుడు న్యాయవాదితోపాటు మరో వ్యక్తి మృతి

బిహార్‪లో కోర్టు ఆవరణంలో పేలుడు న్యాయవాదితోపాటు మరో వ్యక్తి మృతి

బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని సివిల్ కోర్టు ఆవరణంలోని ట్రాన్స్ ఫార్మర్ పేలింది. ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫర్మర్ పేలి, భారీగా మంటలు కమ్ముకున్నాయి. ఈ పేలుడు ఘటనలో  ఒక న్యాయవాదితో పాటు ఓ షాప్ యజమాని ప్రాణాలు కోల్పోయారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్‌గా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

దీంతో న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పారు. సివిల్ కోర్టు కాంప్లెక్స్‌ లోని గేట్ నంబర్ వన్ దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు ఒక్కసారిగా కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.