కరోనా వైరస్ కు గంజితాగేవాళ్లైనా..బెంజ్ నడిపేవాళ్లైనా ఎవరైనా ఒకటే. అందుకే సామాన్యుల నుంచి ధనికుల వరకు మాస్క్ తప్పని సరిగా ధరిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫేస్ మాస్క్ ధరించి అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారు. లాంబోర్గిని కారులో ఫేస్ మాస్క్ ధరించి..సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో రజినీ లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ..ఫేస్ మాస్కు ధరించి అందరికీ స్పూర్తిగా నిలుస్తుండడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంత డబ్బున్నా పనికి రాదని చెప్తూనే.. సాదా దుస్తుల్లో సింపుల్ గా మాస్కు పెట్టుకుని కోట్లాదిమందికి ఆదర్శంగా నిలుస్తున్న రజనీ ఫొటోను అభిమానులు #LionInLamborghini హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
