బంగారం కోసం వృద్ధురాలిని చంపిన వాలంటీర్

బంగారం కోసం వృద్ధురాలిని చంపిన వాలంటీర్

గోల్డ్​ కోసం ఓ వాలంటీర్​ వృద్ధురాలిని చంపిన ఘటన ఏపీలోని విశాఖపట్నం లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సుజాతనగర్​లో నివసిస్తున్న కోటగిరి శ్రీనివాస్​ 95వ వార్డులో పురుషోత్తపురంలో ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​ నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద పురుషోత్తపురానికి చెందిన వార్డు వాలంటీర్​ రాయవరపు వెంకటేశ్​పార్ట్​టైం జాబ్​ చేస్తున్నాడు. 

జులై 30 రాత్రి 10 గంటలకు శ్రీనివాస్​ ఇంటికి వెంకటేశ్​ వెళ్లి మళ్లీ షాప్​నకు తిరుగుపయనమయ్యాడు. అర్ధరాత్రి 12.30 కి శ్రీనివాస్ ఇంటికి వచ్చి చూసే సరికి ఆయన తల్లి కోటగిరి వరలక్ష్మీ(71) అచేతనంగా మంచంపై పడి ఉంది.

ఆమె మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వార్డు వాలంటీర్​ వెంకటేశ్​వచ్చి వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. 

పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వృద్ధురాలి మెడలో గోల్డ్​ని కాజేయడానికి ఆమెను ఊపిరాడకుండా చేసి అతనే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును లోతుగా దర్యాప్తు  చేస్తున్నారు. డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.