ట్విట్టర్‌‌‌‌లో మాటల యుద్ధం

ట్విట్టర్‌‌‌‌లో మాటల యుద్ధం
  • చార్జ్​షీట్​లో లిక్కర్​ క్వీన్​ పేరు 28సార్లు ఉంది: రాజగోపాల్​
  • 28 సార్లయినా.. 28 వేల సార్లయినా అబద్ధం నిజం కాదు: కవిత
  • స్కామ్​పై ప్రజలకు వివరణ ఇవ్వాలన్న మాణిక్కం
  • చార్జ్​షీట్​లో లిక్కర్​ క్వీన్​ పేరు 28సార్లు ఉంది: రాజగోపాల్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్‌‌‌‌ స్కామ్​పై బుధవారం నేతల మధ్య ట్విట్టర్‌‌‌‌లో మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. స్కామ్​లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు రావడంపై  మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌ రెడ్డి, కాంగ్రెస్‌‌‌‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్​ మణిక్కం ఠాగూర్‌‌‌‌  ట్వీట్లు చేయగా.. ఇందుకు ఆమె స్పందించారు. లిక్కర్‌‌‌‌ స్కామ్​లో అమిత్​ అరోరా రిమాండ్‌‌‌‌ రిపోర్టులో కవిత పేరు మొదటిసారిగా వెలుగుచూసింది. తాజాగా సమీర్‌‌‌‌ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జ్​షీట్‌‌‌‌లోనూ ఆమె పేరు ఈడీ పేర్కొంది.

వివరణ ఇవ్వాలన్న మాణిక్కం.. అంతా అవాస్తవమన్న కవిత

లిక్కర్‌‌‌‌ స్కామ్​లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చారన్న దానిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌‌‌‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్​ మాణిక్కం ఠాగూర్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు. దీనిపై కవిత  స్పందిస్తూ..  తనపై నిందలు పూర్తిగా అవాస్తవమని, కాలమే తన నిబద్ధతను రుజువు చేస్తుందని రీ ట్వీట్​ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని.. పెట్టుబడిదారుల అనుకూల విధానాలు అమలు చేస్తున్న విషయాన్ని కేసీఆర్‌‌‌‌ ఎండగడుతుండటంతోనే బీజేపీ భయపడుతోందని ఆమె ఆరోపించారు.