సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట క‌ల‌క‌లం..కిరోసిన్ తో నిప్పంటిచుకున్న త‌ల్లి, కుమార్తె

సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట క‌ల‌క‌లం..కిరోసిన్ తో నిప్పంటిచుకున్న త‌ల్లి, కుమార్తె

ఓ భూవివాదం విష‌యంలో మ‌నోవేద‌న‌ కు గురైన త‌ల్లి కూమార్తె సీఎం క్యాంప్ కార్యాల‌యం ఎదుట కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతుంది. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ సీఎం యోగి ఆధినాధ్ క్యాంప్ కార్యాల‌యం లోక్ భ‌వ‌న్ ఎదుట అమేథికి చెందిన ఒమ‌న్ ఆమె కుమార్తె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. భూ వివాదం విష‌యంలో త‌మ‌కు ఆన్యాయం జ‌రిగింద‌ని ఆందోళ‌న‌కు గురైన ఒమ‌న్ త‌న కుమార్తెతో క‌లిసి సీఎం క్యాంప్ కార్యాల‌యానికి వ‌చ్చింది. హైసెక్యూరిటీ జోన్ లో శుక్ర‌వారం సాయంత్రం 5.40గంట‌ల‌కు ఒమ‌న్ ఆమె కుమార్తె లు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది. వారిని ప్ర‌మాదం నుంచి కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. అనంత‌రం స్థానికంగా ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించి ట్రీట్ మెంట్ అందించారు. అయితే ఆత్మ‌హ‌త్య చేసుకున్న బాధితుల ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.
ఈ ఘ‌ట‌న‌పై సీఎం క్యాంప్ కార్యాల‌యం పోలీస్ ఉన్న‌తాధికారులు స్పందించారు. భూవివాదంలో ఒమ‌న్ క్యాంప్ కార్యాల‌యానికి వ‌చ్చి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని, సీఎం ను కూడా క‌ల‌వ‌లేద‌ని తెలిపారు. బాధితుల ఆత్మ‌హ‌త్య‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభిస్తామ‌ని ఉన్న‌తాధికారులు చెప్పారు.