చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. ఏమైందంటే?

చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీసిన మహిళ.. ఏమైందంటే?

విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. చంద్రబాబును కలిసేందుకు కడప జిల్లా మదనపల్లి నుంచి వచ్చింది. ఏం జరుగుతుందో తెలియక సెక్యూరిటీ సిబ్బంది కంగారుపడ్డారు.. ఆమె మాత్రం ఆగకుండా.. చంద్రబాబు కాన్వాయ్ వెంట పరుగులు తీశారు.  కాన్వాయ్ వెంట పరుగులు తీయడం  గమనించిన బాబు వెంటనే కాన్వాయ్ ను  నిలిపి ఆమెతో మాట్లాడారు. 

టీడీపీ గెలుపుకోసం రేయింబవళ్లు శ్రమించానని ఆమె తెలపడంతో ఆయన థాంక్స్ చెప్పారు. 104 డిగ్రీల జ్వరం ఉన్నప్పటికీ చూసేందుకు వచ్చానని,  ప్రభుత్వం ద్వారా తనకు వైద్యసాయం అందించాలని ఆ మహిళ చంద్రబాబును కోరింది.  మహిళకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా ఆమెతో చంద్రబాబుతో   ఫోటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.