ఇంటికెళ్లి మరీ కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

V6 Velugu Posted on Oct 13, 2021

తన కూతురిని  మోసం చేశాడని ఇంటికెళ్లి మరీ కార్పొరేటర్ భర్తను చెప్పుతో  కొట్టింది ఓ మహిళ.  ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో   జరిగింది. తన కూతురిని ఎత్తుకెళ్లిన కార్పొరేటర్ భర్త ఆకుల శీనును రాత్రి పట్టుకున్నామని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపించారు.   వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని... ఇదే విషయాన్ని గతంలోనూ చెప్పినా  ఆకుల శీను తన తీరు మార్చుకోలేదన్నారు. తమకు న్యాయం చేయాలంటూ  వినాయక్ నగర్ లోని  కార్పొరేటర్ భర్త ఇంటిముందు బాధితులు ఆందోళనకు దిగారు. తమ కూతర్ని అప్పగించాలన్నారు.

Tagged woman, NIzamabad, HOME, vinayaknagar, slappe, corporator husband

Latest Videos

Subscribe Now

More News