డబ్బు కొట్టేసిన కొట్టుకే.. మందు కొట్టి మళ్లీ వచ్చాడు.. ఆ తర్వాత

డబ్బు కొట్టేసిన కొట్టుకే.. మందు కొట్టి మళ్లీ వచ్చాడు.. ఆ తర్వాత

దొంగతనం చేశారు అంటే ఏం చేస్తారు.. మళ్లీ పత్తా లేకుండా పోతారు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చి.. వాళ్లు ఎంక్వయిరీ చేస్తే కానీ దొరకదు.. ఈ దొంగ మాత్రం చాలా వెరైటీ.. డబ్బు, సెల్ ఫోన్ కొట్టేసిన షాపుకే మందు కొట్టి మళ్లీ వచ్చాడు.

ఈ ఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ లోని  తిరుమల నగర్ లోని ఓ మహిళ పండ్ల దుకాణం పెట్టుకుంది.

 అయితే అక్కడికి వచ్చిన ఓ దొంగ...పండ్లు కొంటున్నట్టుగా నటించి  గల్లా పెట్టేలో ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ ఎత్తుకుని అక్కడినుంచి పారిపోయాడు. దీంతో ఆమె దొంగ దొంగ అనే అరిచేలోపు అక్కడినుంచి పారరయ్యాడు. 

అయితే కాసేపటికీ ఫుల్ గా మందు కొట్టి డబ్బులు  కొట్టేసిన కొట్టుకే మళ్లీ వచ్చాడు. అయితే అతని దగ్గర ఉన్న  సెల్ ఫోన్ ను గమనించిన ఆ మహిళ స్థానికుల సహయంతో దొంగను పట్టుకుని చెట్టుకు కట్టేసి  పోలీసులకు అప్పగించింది.