ఈనెల 17న ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో "మోడీ కేసరి" పేరుతో రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ నిర్వహించనున్నారు. భారత్ వ్యాయామశాల స్పోర్ట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ క్రీడలను నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియం ఒలింపిక్ భవన్ లో ఈవెంట్ పోస్టర్ ను తెలంగాణ ఒలింపిక్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్ తో కలిసి ఆర్గనైజర్స్ ఆవిష్కరించారు.
సెప్టెంబర్ 17, 18, 19 తేదీల్లో మూడు రోజుల ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుండి 300 మందికిపైగా రెజ్లర్స్.. ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
