కేసు అవుతుందనే భయంతో ఆస్పత్రి పై నుంచి దూకి యువకుడు సూసైడ్

కేసు అవుతుందనే భయంతో ఆస్పత్రి పై నుంచి దూకి యువకుడు సూసైడ్
  • ఎల్ బీనగర్ పరిధి ఎన్టీఆర్ నగర్ లో ఘటన

ఎల్ బీనగర్, వెలుగు: కారులో వెళ్తూ యాక్సిడెంట్ చేయగా, కేసు అయి జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ యువకుడు ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్యహత్యకు పాల్పడ్డాడు.  ఎల్ బీనగర్ పోలీసులు తెలిపిన ప్రకారం.. వనస్థలిపురం పరిధి ఎఫ్ సీఐ కాలనీకి చెందిన గుమ్మడి రితీశ్ రెడ్డి(30) వ్యాపారం చేస్తుంటాడు.  మంగళవారం రితీశ్ రెడ్డి కారులో వెళ్తూ ముసారాం బాగ్ వద్ద రోడ్డు యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌ చేయగా..  అతడి కారును బైక్ పై  ఇద్దరు వ్యక్తులు వెంబడించడంతో భయాందోళన చెందాడు. 

తనపై కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోననే ఆందోళనతో రితీశ్ రెడ్డి ఎన్టీఆర్ నగర్ లోని ఆద్య ఆస్పతికి మధ్యాహ్నం 12:10 గంటలకు వెళ్లి కారును పార్కింగ్ చేశాడు. అతడు ఆస్పత్రి 4వ అంతస్తుపైకి వెళ్లి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమితం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే.. అతను యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

చందానగర్​లో మహిళ..

గచ్చిబౌలి: డబ్బుల విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెందిన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చందానగర్ ​పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన రమేశ్, మాధురిలత(36) దంపతులకు ఇద్దరు పిల్లలు. రమేశ్ హైటెక్​ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్​వేర్​జాబ్ చేస్తూ..  కుటుంబంతో చందానగర్ లోని​హుడా కాలనీలో ఉంటున్నాడు.  

వీరితో పాటు లత సోదరుడు కూడా ఉంటున్నాడు. గత నెల30న ఈస్టర్ ​పండుగ రోజు లత సోదరుడు పిల్లలను తీసుకొని సొంతూరు వెళ్లాడు. మరుసటి రోజు డబ్బుల విషయంలో దంపతులు గొడవపడ్డారు.  దీంతో మనస్తాపం చెందిన లత సోమవారం తెల్లవారుజామున బెడ్​రూమ్ లో ఫ్యాన్​కు ఉరేసుకుంది. మరో బెడ్ రూమ్ లో వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్న రమేశ్​వచ్చే చూసే సరికి లత ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసినట్టు చందనగర్ పోలీసులు తెలిపారు.

మియాపూర్​లో బాలిక..

మియాపూర్ : నారాయణపేట్ కు చెందిన వెంకటప్ప, పద్మ దంపతులకు కొడుకు, ఇద్దరు కుమార్తెలు( కవలలు) ఉన్నారు. సిటీకి వచ్చి మియాపూర్ లోని గోపాలరావు నగర్ ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కూలీ పనులకు వెళ్లగా మధ్యాహ్నం గోపాలరావు కొడుకు అన్నం తినేందుకు ఇంటికి వచ్చి చూసే సరికి చెల్లెలు (17)  ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా వెళ్లి  కేసు నమోదు చేశారు. బాలిక ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని మియాపూర్ పోలీసులు తెలిపారు.