సీఎంను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

సీఎంను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

ఆమనగల్లు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకే లు అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది ప్రజాపాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిచిందని, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిద్దామని సీఎం చెప్పినట్లు వారు పేర్కొన్నారు.